సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచుకుంది బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా విజయం తర్వాత తెలుగులో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వచ్చాయి. న్యాచురల్ స్టార్ నాని సరసన హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ కొట్టింది.
ఇటీవలే రౌడీ హీరో విజయ్ దేవరకొండ జోడిగా ఫ్యామిలీ స్టార్ మూవీతో అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.
దీంతో ఈ బ్యూటీకి ఇప్పుడు తెలుగులో ఆఫర్స్ తగ్గిపోయాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ హీరోయిన్ తీసుకున్న డెషిషన్ ఇండస్ట్రీని షేక్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది.
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు మృణాల్ ఠాకూర్‌కు ఇంట్లోవాళ్లు కొన్ని కండీషన్స్ పెట్టారట. బోల్డ్ పాత్రలలో నటించనని తన తండ్రికి మాట ఇచ్చినట్లు తెలిపింది.
కానీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రావట్లేదని బాధపడుతుంది. ఎక్కువగా అలాంటి పాత్రలే రావడంతో ఎక్కువ సినిమాలకు నో చెప్పిందట మృణాల్.
అయితే తండ్రికి ఇచ్చిన మాట కోసం బోల్డ్ పాత్రలలో నటించకపోవడంతో కెరీర్ రిస్క్ లో పడుతుందని గుర్తించి మాట తప్పాలని ఫిక్స్ అయ్యిందంట ఈ హీరోయిన్.
ఇప్పుడు సినిమాల్లో గ్లామర్ రోల్స్.. బోల్డ్ పాత్రలు చేయాలని ఫిక్స్ అయ్యిందట. కెరీర్ మంచిగా సాగాలంటే తండ్రికి ఇచ్చిన మాట తప్పాల్సిందే అంటుంది మృణాల్.