ఆ హీరో విషయంలో బాధపడ్డానంటున్న మృణాల్.. ఎందుకంటే..
TV9 Telugu
Pic credit - Instagram
ప్రస్తుతం అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలలో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ బ్యూటీ చేతిలో ఎక్కువే మూవీస్ ఉన్నాయి.
ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఎంపిక చేసుకున్న పాత్రలలో ఒదిగిపోయి.. ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్.. ఇప్పటివరకు తాను ఎక్కువగా సీరియస్ స్టోరీల్లో మాత్రమే కనిపించానని.. దాంతో డాన్స్ చేసే అవకాశమే రాలేదని తెలిపింది.
ముఖ్యంగా హృతిక్ రోషన్ తో కలిసి నటించిన సూపర్ 30లో ఆయనతో ఆడిపాడే ఛాన్స్ దక్కనందుకు చాలా బాధపడ్డానని చెప్పింది. జెర్సీ విషయంలోనూ అంతేనట.
షాహిద్ కపూర్ తో కలిసి డాన్స్ చేసే పరిస్థితి రాలేదని.. అందుకే ఆయనతో కలిసి ఎంటర్టైనర్ మూవీలో నటించాలనుకుంటున్నాని.. తన సహ నటులంతా డ్యాన్సర్లే అని తెలిపింది.
కానీ వారితో సినిమాల్లో డాన్స్ చేసే స్కోప్ లేదు కాబట్టి.. తెర వెనక డాన్స్ చేస్తుంటామని.. వాటిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటామని చెప్పుకొచ్చింది.
ఆ లోటును ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమా తీరుస్తోందని చెప్పుకొచ్చింది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
అలాగే హిందీలో తనకు రొమాంటిక్ చిత్రాల్లో నటించేందుకు ఛాన్స్ ఎందుకు రావడం లేదో తనకు తెలియడం లేదని.. ప్రేమకథల్లో నటించే పాపులారిటీ ఇంకా రాలేదేమో అని తెలిపింది.