09 July 2025

అతడంటే పిచ్చి.. మృణాల్ ఠాకూర్ ఇష్టమైన హీరో ఎవరంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 

మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. సీతామహాలక్ష్మి పాత్రలో అద్భుతమైన నటనతో కుర్రకారు హృదయాలను దొచుకుంది. 

ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో మరిన్ని హిట్స్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. 

ప్రస్తుతం డెకాయిట్ చిత్రంలో నటిస్తుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఇండస్ట్రీలో తనకు ఓ స్టార్ హీరో అంటే ఇష్టమని తెలిపింది. 

తనకు బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ అంటే చాలా ఇష్టమని.. ఆయనతో కలిసి నటించిన జెర్సీ సినిమా గురించి చెప్పుకొచ్చింది ఈ భామ. 

షాహిద్ అంటే తనకు చాలా ఇష్టమని.. అలాంటిది అతడితో కలిసి నటించే ఛాన్స్ రావడంతో వెంటనే ఓకే చెప్పానని గుర్తుచేసుకుంది.

షాహిద్ కపూర్ నవ్వు అంటే పిచ్చి అని.. సెట్స్ లో ఆయన నవ్వుతుంటే అలా చూస్తూ ఉండిపోయేదాన్ని అని.. ఎంతో బాగుంటుందని తెలిపింది. 

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ అమ్మడు తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రాజెక్ట్స్ పై పూర్తిగా ఫోకస్ పెట్టింది.