04 April 2024

ఎప్పటికీ అతడే నాకిష్టమైన కోస్టార్.. మృణాల్ ఎవరి గురించి చెప్పింది ?. 

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో వరుస అవకాశాలు అందుకుంటూ అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ ఒకరు. 

సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాతో మరో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించింది. ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ అవుతుండగా.. ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. 

ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ మాట్లాడుతూ.. సీతారామం హీరో దుల్కర్ సల్మాన్ ఎప్పటికీ తనకు ఇష్టమైన కోస్టార్ అని తెలిపింది. 

మృణాల్ మాట్లాడుతూ.. నాకు ఇష్టమైన సహనటుడు ఎవరని అడిగితే సమాధానం చెప్పడం కష్టమే. కానీ దుల్కర్ సల్మాన్ పేరు ముందు చెబుతాను. 

ఎందుకంటే సీతారామం సినిమాలో నేను చేసిన పాత్ర ఎంతో కష్టంగా అనిపించింది. ఆ సమయంలో దుల్కర్ అడుగడుగునా ధైర్యాన్ని అందించాడు. 

అతడి వల్లే నేను ఆ పాత్రను అంత బాగా చేయగలిగాను. ఇన్ని భాషల్లో నటిస్తున్నానంటే కూడా ఆయన నాకు స్పూర్తి. నాకు మంచి స్నేహితుడు అని తెలిపింది. 

ఇక విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ పూర్థిస్తాయి కుటుంబానికి సంబంధించిన సినిమా అని ప్రేక్షకులకు నచ్చుతుందని అన్నారు మృణాల్.