మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన బుల్లితెర నటిగా తన కెరీర్ ప్రారంభించి తన నటనతో, అందంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
ఇక తెలుగులో వచ్చిన ‘సీతా రామం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే తెలుగింటి మహాలక్ష్మీలా అందరి మనసు దోచుకుంది.
ఫ్యామిలీ ఆడియన్స్‌లో మృణాల్‌కు ప్రత్యేక స్థానం ఉందంటే అతిశయోక్తి కాదు. తర్వాత వచ్చిన ‘హాయ్ నాన్న’ చిత్రంతో కూడా మరో భారీ హిట్ తన ఖాతాలో వేసుకుంది.
తాజాగా ‘ఫ్యామిలీ స్టార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మృణాల్ తన సినిమా గురించి, ప్రేక్షకులు ఇచ్చిన సక్సెస్ గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది.
మృణాల్ మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకులకు సాష్టాంగ నమస్కారం పెడుతున్నాను. మీరు నాకు ఇచ్చిన సక్సెస్‌కు నేను చాలా ఆనందంగా ఉన్నాను థాంక్యూ.
నేను ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ మీరు ఇస్తున్న ఈ సపోర్ట్‌కు నాకు మాటలు రావడం లేదు.
ఇలాంటి సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.