ఎప్పుడూ ఊహించలేదు ఇలా జరుగుతుందని.. మృణాల్ కామెంట్స్..
Rajitha Chanti
Pic credit - Instagram
బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యింది మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత హిందీలో కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించింది.
2012లో ముజ్సే కుచ్ కెహెతి.. ఏ ఖామోషియాన్ సీరియల్ ద్వారా బుల్లితెరపైకి అడుగుపెట్టిన మృణాల్.. కుంకుమ భాగ్య సీరియల్తో ఫేమస్ అయ్యింది.
2014లో విట్టి దండు అనే మరాఠీ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. హిందీలో జెర్సీ, లస్ట్ స్టోరీస్ 2, లవ్ సోనియా, సూపర్ 30 చిత్రాల్లో నటించింది.
2022లో సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో సీతామహాలక్ష్మి పాత్రలో అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.
ఆ తర్వాత ఫ్యామిలీ స్టార్, హాయ్ నాన్న చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం టాప్ హీరోయిన్గా ఉన్న మృణాల్.. అసలు ఇండస్ట్రీలోకి రావాలని అనుకోలేదని చెబుతుంది.
తన బాల్యం మొత్తం సిటీస్ తిరగడమే సరిపోయిందని.. 10 నుంచి 11 స్కూల్స్ మారి ఉంటానేమో అని తెలిపింది. నటిగా ఎదగాలి అని ఎప్పుడూ అనుకోలేదట.
డిగ్రీలో బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా చేశానని.. అప్పుడే నటనపై తనకు ఉన్న ఆసక్తిని తెలుసుకున్నానని.. ఆ తర్వాత అడిషన్స్ తనకు మరింత ఇంట్రెస్ట్ కలిగించాయట.
అలాగే తన స్నేహితులు కూడా సినీ ఇండస్ట్రీలోకి వెళ్లాలని ప్రోత్సహించారని.. అలా తనకు సినిమాలపై ఆసక్తి వచ్చిందని.. నటిగా ఉంటానని ఎప్పుడు అనుకోలేదని తెలిపింది.