TV9 Telugu

అవకాశాలు రావాలి అంటే గ్లామర్ డోస్ ఉండాల్సిందే: మృణాల్

08 January 2024

ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరెట్‌గా మారిపోయారు సిల్వర్ స్క్రీన్‌ సీత మృణాల్ ఠాకూర్‌.

సీతా రామం, హాయ్ నాన్న సినిమాలతో తెలుగు ఆడియన్స్‌కు చేరువైన ఈ బ్యూటీ ట్రెండీ అనిపించుకుంటున్నారు.

సీతా రామం సినిమాలో మృణాల్‌ను  చూసిన ప్రేక్షకులు కూడా ఇలాగే ఫీల్ అయ్యారు. తొలి సినిమాతోనే సౌత్‌ ఆడియన్స్‌ను ఫిదా చేశారు ఈ నార్త్ బ్యూటీ.

హోమ్లీ క్యారెక్టర్‌లో మృణాల్‌ను చూసి అచ్చమైన పదహారణాల తెలుగుతనం అంటూ పొగిడేశారు.

అందుకే తరువాత చేసిన సినిమాల్లోనూ తెర మీద హోమ్లీ లుక్స్‌తో ఆకట్టుకున్నారు.

తెర మీద గార్జియస్ బ్యూటీ అనిపించుకున్న మృణాల్, సోషల్ మీడియాలో మాత్రం టూ హాట్ అనిపించేలా రచ్చ చేస్తుంటారు.

అందుకే చేసిన సినిమాలు తక్కువే అయినా అమ్మడి పేరు మాత్రం ఆన్‌లైన్‌లో గట్టిగా ట్రెండ్ అవుతోంది.

వెండితెర మీద లాంగ్ టైమ్‌ కెరీర్ కంటిన్యూ అవ్వాలంటే గ్లామర్ ఇమేజ్‌ కూడా ఉండాల్సిందే అంటున్నారు మృణాల్‌.