సీతారామం బ్యూటీకి ఆ ట్యాలెంట్ నిజంగా అదృష్టమే.. 

12 November 2023

Pic credit - Instagram

సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. మొదటి చిత్రంతోనే తెలుగు అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. 

ఆ తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే మంచి క్యూరియాసిటీ నెలకొంది. 

 ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ చూస్తుంటే ఇందులో మృణాల్ మరింత అందంగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ముక్కుపుడక.. ఉంగరాల జుట్టుతో కట్టిపడేయం ఖాయం. 

 ఈ సినిమానే కాకుండా హీరో విజయ్ దేవరకొండ జోడిగా ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో విజయ్ భార్యగా మృణాల్ కనిపించనుందని గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. 

ఇవే కాకుండా తెలుగులో ఈ బ్యూటీకి మరిన్ని అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. బుచ్చిబాబు, రామ్ చరణ్ సినిమాలోనూ మృణాల్ కు ఛాన్స్ వచ్చిందని టాక్ వినిపిస్తుంది. 

ఇటు తెలుగులో.. అటు హిందీలోనూ ఫుల్ జోష్ మీదుంది. ఇటీవలే హిందీలో ఇషాన్ కట్టర్ తో కలిసి పిప్పా అనే వార్ సినిమాలో కనిపించింది. ఇందులో యాక్షన్ సీన్స్ చేయనుంది. 

 అటు గ్లామర్స్ కాకుండా ఇప్పుడు పిప్పా సినిమాతో యాక్షన్ రోల్ అయినా సిద్ధమే అని చెప్పేస్తోంది మృణాల్. ఇందులో రాధ అనే పాత్రలో మృణాల్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. 

ఈ సినిమా సగభాగం తన పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అంటే ఈ రోల్ మృణాల్ కు సరైన గుర్తింపు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత మరింత క్రేజ్ పెరగనుంది