బ్రహ్మ సృష్టిలో ఎనిమిదో అద్భుతం ఏమో ఈ ముద్దుగుమ్మ..
TV9 Telugu
10 January 2024
1 ఆగస్టు 1992 సంవత్సరంలో మహారాష్ట్ర రాష్ట్రంలోని ధూలే జిల్లాలో పుట్టి పెరిగింది వయ్యారి భామ మృణాల్ ఠాకూర్.
ముంబైకి సమీపంలోని జల్గావ్‌లో సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ స్కూల్, అలాగే వసంత్ విహార్ హై స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తిచేసింది.
టెలివిజన్ లో యాక్టింగ్ కెరీర్ ని కొనసాగిస్తున్నందున KC కాలేజీలో గ్రాడ్యుయేట్ చేయకుండా డ్రాప్ అవుట్ అయ్యింది.
2012 నుంచి 2014 వరకు హిందీలో కొన్ని టెలివిజన్ సీరియల్స్ లో లీడ్ రోల్స్ లో నటించి ఆకట్టుకుంది ఈ అందాల తార.
2014లో రాహుల్ జాదవ్ దర్శకత్వంలో హలో నందన్ అనే మరాఠీ చిత్రంతో కథానాయకిగా సినీ అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.
2018లో లవ్ సోనియా అనే హిందీ డ్రామా చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. తర్వాత కొన్ని హిందీ చిత్రాల్లో నటించింది.
2022లో సీతారామం అనే పీరియడ్ రొమాంటిక్ డ్రామా చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. సీత మహాలక్ష్మిగా బ్లాక్ బస్టర్ అందుకుంది.
2023లో నానికి జోడిగా హాయ్ నాన్నతో తెలుగులో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫామిలీ స్టార్ లో నటిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి