ఇంతటి అందాన్ని సృష్టించిన ఆ బ్రహ్మకి కూడా ఈమెను వర్ణించడానికి మాటలు చాలవేమో..

TV9 Telugu

21 January 2024

1 ఆగస్టు 1992న మహారాష్ట్ర రాష్ట్రంలోని ధూలే అనే ఊరిలో జన్మించింది టాలీవుడ్ సీతామహాలక్షి మృణాల్ ఠాకూర్.

జల్గావ్‌లోని సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ స్కూల్ మరియు ముంబైకి సమీపంలోని వసంత్ విహార్ హై స్కూల్‌లో చదువుకుంది

టెలివిజన్ తన యాక్టింగ్ కెరీర్ కొనసాగిస్తున్నందున KC కళాశాల గ్రాడ్యుయేట్ మధ్యలోనేవదిలేసింది ఈ వయ్యారి భామ.

స్టార్ ప్లస్ సిరీస్ ముజాహాసే కుచ్ కెహేతి...ఎహ్ ఖామోషియాన్‌లో మోహిత్ సెహెగల్ సరసన గౌరీ భోంస్లేగా ప్రధాన పాత్రలో నటించింది.

2014లో హలో నందన్ అనే ఓ మరాఠి చిత్రంతో సినీ అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. విట్టి దండు, సురాజ్య అనే మరాఠి చిత్రాల్లో కనిపించింది.

తర్వాత 2018లో లవ్ సోనియా అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సూపర్ 30, ఘోస్ట్ స్టోరీస్, జెర్సీ వంటి చిత్రాల్లో ఆకట్టుకుంది.

2022లో దుల్కర్ సల్మాన్ సరసన తెలుగు పీరియడ్ రొమాంటిక్ చిత్రం సీతారామంలో సీతామహాలక్ష్మి పాత్రలో ఆకట్టుకుంది.

ఇటీవల 2023లో నానికి జోడిగా హాయ్ నాన్న అనే తెలుగు చిత్రంలో కథానాయకిగా నటించింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది.