అందంలో అప్సరస.. అభినయంలో ఎవరెస్టు ఈ వయ్యారి..
TV9 Telugu
25 March 2024
1 ఆగస్టు 1992న మహారాష్ట్ర రాష్ట్రంలోని ధూలేలో ఓ మరాఠి కుటుంబంలో జన్మించింది అందాల భామ మృణాల్ ఠాకూర్.
జల్గావ్‌లోని సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ స్కూల్, ముంబైకి సమీపంలోని వసంత్ విహార్ హై స్కూల్‌లో చదువుకుంది.
నటనపైన ఉన్న ఇష్టంతో యాక్టింగ్ లో కెరీర్ కొనసాగిందిచేందుకు KC కాలేజీలో గ్రాడ్యుయేట్ మధ్యలోనే విడిచిపెట్టింది ఈ వయ్యారి.
2012లో ముజ్సే కుచ్ కెహ్తీ...యే ఖామోషియాన్ అనే టెలివిజన్ ధారావాహికతో నటనలో కెరీర్ ప్రారంభించింది ఈ వయ్యారి.
2012లో ఖామోషియాన్, 2014 నుంచి 2016 వరకు కుంకుమ్ భాగ్య అనే మరో రెండు టీవీ సీరియల్స్ లో నటించింది ఈ బ్యూటీ.
2014లో హలో నందన్ అనే మరాఠి చిత్రంతో తొలిసారి వెండితెరకు పరిచయం అయింది. లవ్ సోనియాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
2022లో సీతారామంలో దుల్కర్ సల్మాన్ సరసన కథానాయకిగా తెలుగు చలనచిత్ర అరంగేట్రం చేసింది. ఇది బ్లాక్ బస్టర్ అయింది.
2023లో నానికి జోడిగా హాయ్ నాన్నతో తెలుగులో మరో విజయాన్ని అందుకుంది. ఏప్రిల్ 5న తెలుగులో ఈమె నటించిన ఫ్యామిలీ స్టార్ విడుదల కానుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి