ముద్దుగుమ్మ మృణాల్ ను స్టార్ హీరోలు పట్టించుకోవడం లేదా..?

Rajeev 

27 June 2025

Credit: Instagram

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. మరాఠీ బుల్లితెరపైకి నటిగా ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. 

 ఆ తర్వాత నెమ్మదిగా కథానాయికగా మారింది. హిందీలో హీరోయిన్ ఆఫర్స్ అందుకుంటూ అద్భుతమైన నటనతో మెప్పించింది.

మృణాల్ కు ఎక్కువగా క్రేజ్ వచ్చింది మాత్రం తెలుగు సినిమాతోనే. హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది

ఇందులో సీతామహాలక్ష్మీ పాత్రలో అందం, అభినయంతో కట్టిపడేసింది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది. తెలుగుతోపాటు అటు హిందీలోనూ మరిన్ని ఆఫర్స్ అందుకుంది.

ఫ్యామిలీ మ్యాన్ సినిమా తర్వాత మృణాల్ సైలెంట్ అయ్యింది. ఈ సినిమా నిరాశపరచడంతో మృణాల్ కు అంతగా ఆఫర్స్ రావడం లేదు. 

ఇటీవలే కల్కి సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. ఇప్పుడు తమిళ్ లో ఆఫర్ అందుకుందని టాక్. ఇప్పుడు ఈ చిన్నది సినిమాల స్పీడ్ తగ్గించింది.