నా దృష్టిలో రొమాన్స్ అంటే అదే: మృణాళ్ ఠాకూర్
TV9 Telugu
01 July 2024
సీతారామం' మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది మృణాళ్ ఠాకూర్. ఇందులో ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు.
ఆ తర్వాత 'హాయ్ నాన్న'తో మరో హిట్ అందుకుందీ అందాల తార. 'ఫ్యామిలీ స్టార్' మాత్రం యావరేజ్ గా నిలిచింది.
తాజాగా ప్రభాస్ 'కల్కి'లో అతిథి పాత్ర పోషించిన మృణాళ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రొమాన్స్ గురించి తన అభిప్రాయాన్ని బయటపెట్టింది.
'మన పట్ల ప్రేమ, శ్రద్ధ చూపించడం, మన కోసం చిన్న చిన్న పనులు చేయడం, మన ఆలోచనలో ఉండటమనేదే రొమాంటిక్ చర్యలు' అని చెప్పుకొచ్చింది.
'నా దృష్టిలో రొమాన్స్ అనేది చిన్న చిన్న చేష్టలతోనే ఉంటుంది. మనకు నచ్చిన వాళ్లు మనతో నిజాయతీగా ఉండటం'
కాగా కల్కి సినిమాకు మృణాళ్ ఠాకూర్ కనీసం ఒక్క రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదని సమాచారం
తనకు సీతారామం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రేమతోనే ఫ్రీగా సినిమా చేసిందట.
ప్రస్తుతం మృణాళ్ ఠాకూర్ హిందీలో ఓ సినిమా చేస్తోంది. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది హీరోగా నటిస్తున్నాడు.
ఇక్కడ క్లిక్ చేయండి..