19 February 2024
రష్మిక, దుల్కర్ పై మృణాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
TV9 Telugu
Pic credit - Instagram
సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. డైరెక్టర్ హనురాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరోయిన్లలో మృణాల్ ఒకరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
సీతారామం సినిమా తన జీవితాన్ని మలుపు తిప్పిందని.. అందులో తనతోపాటు నటించిన రష్మిక మందన్నా, దుల్కర్ సల్మాన్ నుంచి చాలా విషయాలు నేర్చుకుందట.
రష్మిక పాత్రల ఎంపికలో చాలా ప్రత్యేకంగా ఉంటారని.. అప్రీన్ అనే పాత్ర చేయాలంటే చాలా ధైర్యం కావాలని.. ఆ పాత్రను ఆమె తప్ప మరెవరూ చేయలేరట.
అలాగే ఎన్ని గంటలు పనిచేసినా ఆమెలో అలసట కనిపించేది కాదని చెప్పుకొచ్చింది. అలాగే దుల్కర్ సల్మా భాష ఏదైనా పాత్ర నచ్చిచే చేస్తారని చెప్పుకొచ్చింది.
పాత్ర నచ్చితే వెంటనే ఒప్పుకుంటారని.. సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి నిదర్శనం అదే.. తన జీవితోల వీరిద్దరిని స్పూర్తిగా తీసుకున్నట్లు తెలిపింది.
ఈ ఇద్దరి స్పూర్తిగా తీసుకుని సినిమాలను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలిపింది. ఇటీవలే న్యాచురల్ నాని జోడిగా హాయ్ నాన్న సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.
ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తుంది. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. ఈ బ్యూటీ చేతిలో మరిన్ని మూవీస్ ఉన్నాయట.
ఇక్కడ క్లిక్ చేయండి.