దొంగచాటుగా అందరూ అలాంటి సినిమాలే చూస్తారు: మృణాళ్

TV9 Telugu

25 January 2024

 సీతారామం, హాయ్‌ నాన్న సినిమాలతో టాలీవుడ్‌లో బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లు కొట్టేసిందీ బాలీవుడ్‌ బ్యూటీ మృణాళ్‌ ఠాకూర్‌

ప్రస్తుతం ఈమె రౌడీబాయ్‌ విజయ్‌ దేవరకొండతో కలిసి ఫ్యామిలీస్టార్ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇదిలా ఉంటే తనకు రొమాంటిక్ మూవీస్‌లో అవకాశాలు రావడం లేదని తెగ బాధపడిపోతుందీ అందాల  తార

చాలా రోజులుగా ఇలాంటి సినిమాల కోసం ఎదురుచూస్తున్నానని ,అయినా ఛాన్సులు రావడం లేదంటోందీ ముద్దుగుమ్మ.

చిన్నప్పటి నుంచి లవ్‌, రొమాంటిక్‌ సినిమాలు చూస్తూనే పెరిగానని, అయితే ఇప్పుడు అలాంటివి రావట్లేదంటోంది మృణాళ్‌.

అందరూ రొమాన్స్‌ అంటే ఇష్టం లేదన్నట్లుగా నటిస్తారు, కానీ దొంగచాటుగా అలాంటి సినిమాలే చూస్తారందీ బ్యూటీ.  

సీతారామం, హాయ్‌ నాన్న వంటి లవ్ అండ్‌ రొమాంటిక్‌ సినిమాలు హిందీతో పాటు అన్ని భాషల్లోనూ రావాలంటోంది మృణాళ్‌.

 తాను కూడా ఏవి పడితే అవి సినిమాలు చేయనని, తన పాత్రకు ప్రాధాన్యమున్న సినిమాలే ఎంచుకుంటానంటోందీ ముద్దుగుమ్మ.