మృణాలా మజాకా..! గ్యాప్ ఇచ్చిన క్రేజీ ఆఫర్ కొట్టేసిందిగా..

17 December 2024

Rajeev 

ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. 

సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ వయ్యారి భామ. తొలి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయింది. 

హనురాఘవపుడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత.. 

నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమాలో చేసింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. 

దాంతో మృణాల్ టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. చేసిన రెండు సినిమాలు మంచి విజయాలు అందుకోవడంతో క్రేజ్ పెరిగింది. 

ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. 

కానీ మృణాల్ క్రేజ్ తగ్గలేదు. చాలా రోజుల గ్యాప్ తర్వాత కల్కి సినిమాలో మెరిసింది. ఇక ఇప్పుడు అడవి శేష్ డెకాయిట్  సినిమాతో రానుంది.