కోలీవుడ్ నుంచి కబురు.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకున్న మృణాల్

Rajeev 

26 October 2024

ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ చిన్నది టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తొలి సినిమాతో భారీ హిట్ అందుకుంది. 

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమాతో ఈ చిన్నది. మంచి విజయాన్ని అందుకుంది. 

తొలి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయింది ఈ చిన్నది. ఆతర్వాత నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా చేసింది. 

హాయ్ నాన్న సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. 

ఆతర్వాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్లాప్ అయింది. కానీ ఈ చిన్నదాని క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. 

కోలీవుడ్ నుంచి అమ్మడికి అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది. సూర్య సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ అందుకున్న మృణాల్.