07 February 2024

మృణాల్‏కు చేదు అనుభవం.. నెపోటిజం పై షాకింగ్ కామెంట్స్.. 

TV9 Telugu

Pic credit - Instagram

తెలుగు సినీ పరిశ్రమలో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. 

బుల్లితెరపై నటిగా అలరించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించి అలరించింది. ఇక ఇప్పుడు తెలుగులో స్టార్ డమ్ అందుకుంది మృణాల్. 

ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో మరో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. న్యాచురల్ స్టార్ నాని సరసన నటించిన ఈ మూవీలో యష్ణ పాత్రలో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. 

అయితే ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగిన ఓ అవార్డుల వేడుకలకు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది మృణాల్. అలాగే తన వెర్షన్ ఆన్సర్ కూడా చెప్పింది. 

ఆ అవార్డుల వేడుకలో మృణాల్ ఠాకూర్ దగ్గర కొందరు మీడియా ప్రతినిథులు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారని.. ఆ సమయంలో ఓ స్టార్ వారుసుడు అక్కడి వచ్చాడని తెలిపింది. 

దీంతో మీడియా వాళ్లు మృణాల్ తో ఇంటర్వ్యూ మధ్యలో ఆపేసి ఆ స్టార్ కిడ్ దగ్గరకి పరుగులు పెట్టారని.. అదే సమయంలో నెపోటిజం పై షాకింగ్ కామెంట్స్ చేసింది మృణాల్. 

ప్రతి ఒక్కరు నెపోటిజం విషయంలో స్టార్ కిడ్స్ ని నిందిస్తూ ఉంటారని.. కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం నెపోటిజం అనేది స్టార్ కిడ్ తప్పు కాదని అన్నారు. 

ప్రతి ఒక్క అడియన్ స్టార్ కిడ్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటారని.. దీంతో మీడియా కూడా వారి వార్తలు రాయడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పుకొచ్చింది మృణాల్.