11 June 2024
టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మిస్టర్ బచ్చన్ బ్యూటీ.. భాగ్య శ్రీ జోరు..
Rajitha Chanti
Pic credit - Instagram
మాస్ మాహారాజా రవితేజ నటిస్తున్న లేటేస్ట్ చిత్రం మిస్టర్ బచ్చన్. హరీశ్ శంకర్ తెరకెక్కి్స్తున్న ఈ మూవీలో భాగ్య శ్రీ కథానాయికగా నటిస్తుంది.
ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతున్న ఈహీరోయిన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.
మొదటి తెలుగు సినిమా విడుదల కాకుండానే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో రెండు ఆఫర్స్ దక్కించుకుంది. విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో రాబోతున్న సినిమాలో భాగ్య శ్రీ హీరోయిన్. ఇప్పటికే ఈ బ్యూటీ షూటింగ్లో పాల్గొందని టాక్.
తాజాగా ఈ అమ్మడు మరో ఆఫర్స్ అందుకుందట. మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్న తెలుగు సినిమాలో ఈ అమ్మడికి ఛాన్స్ వచ్చిందట.
దుల్కర్ సల్మాన్ హీరోగా సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న సినిమాతో రవి అనే నూనత దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. ఇందులో భాగ్య శ్రీ హీరోయిన్.
ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్స్ ను ఎంపిక చేశారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఇలా వరుస ఆఫర్స్ అందుకుంటున్న హీరోయిన్ తనే.
తక్కువ సమయంలోనే అది కూడా తొలి సినిమా రిలీజ్ కాకముందే చాలా పాపులారిటీని సొంతం చేసుకుంది భాగ్య శ్రీ. త్వరలోనే ఈ బ్యూటీకి గుర్తింపు రావడం ఖాయం.
ఇక్కడ క్లిక్ చేయండి.