14 August 2024
ఇప్పుడు అందరి చూపు ఆ అమ్మాడి పైనే.. భాగ్యశ్రీ బోర్సే క్రేజ్..
Rajitha Chanti
Pic credit - Instagram
మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. ఇందులో రవితేజ సరసన కథానాయికగా నటించింది.
సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు అందమైన లుక్స్ తో యూత్ ను కట్టిపడేసింది ఈ హీరోయిన్.
భాగ్యశ్రీ బోర్సే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రాంతానికి చెందిన అమ్మాయి. కానీ నైజీరియాలోని లాగోస్ ప్రాంతంలో ఈ బ్యూటీ పెరిగింది.
బిజినెస్ మేనేజ్‌మెంట్ చదివేందుకు ముంబయి వచ్చింది. కాలేజీ రోజల్లోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది హీరోయిన్ భాగ్యశ్రీ.
మోడలింగ్ చూస్తూనే కొన్ని కమర్షియల్ యాడ్స్ చేసింది. వాటిలో డెయిరీ మిల్క్ సిల్క్ ప్రకటనతో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
యారియన్ 2 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ వయ్యారి. ఆ సినిమాలో కేవలం చిన్న పాత్రలో కనిపించి ఫేమస్ అయ్యింది.
ఇటీవల విడుదలైన చందు ఛాంపియన్ చిత్రంలో అతిథి పాత్రలో నటించింది. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాతోనే హీరోయిన్ కావాలనే తన డ్రీమ్ నెరవేరిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇందులో మార్వాడీ అమ్మాయి జిక్కీగా కనిపించనుంది.
ఇక్కడ క్లిక్ చేయండి.