ఈ వారం థియేటర్ లో విడుదలకు సిద్దమైన సినిమాలు..
09 October 2023
సాయిరామ్ శంకర్, యాశ శివకుమార్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. ఈ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందు రానుంది.
పులివెందుల మహేష్, ప్రియాపాల్ జంటగా తెరకెక్కిన సినిమా ‘మా ఊరి సిన్మా’. శివరామ్ తేజ ఈ మూవీ అక్టోబర్ 13న విడుదల కానుంది.
అహ్మద్ దర్శకత్వంలో నయనతార, జయం రవి ముఖ్య పాత్రల్లో తమిళ చిత్రం ‘ఇరైవన్’. తెలుగులో ‘గాడ్’ అనే టైటిల్ తో ఈ నెల 13న థియేటర్ లో సందడి చేయనుంది.
ఓ గ్రామం బయోపిక్ గా తెరకెక్కిన చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. ఈ సినిమా అక్టోబర్ 13న ప్రేక్షకులను అలరించనుంది.
రవితేజ మహాదాస్యం హీరో సుద్మూన్ దర్శకత్వం సినిమా ‘సగిలేటి కథ’ ఈ నెల 13న తెరపై సందడి చేయనుంది. విషిక కోట కథానాయక.
అభయ్ నవీన్, కుశాలిని ముఖ్య పాత్రల్లో వచ్చిన మూవీ ‘రాక్షస కావ్యం’. శ్రీమాన్ కీర్తి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 13న రిలీజ్ అవుతుంది.
వికాష్ వశిష్ట, మోక్ష, కుషిత కళ్లపు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ ‘నీతోనే నేను’. ఈ సినిమా కూడా అక్టోబర్ 10న రానుంది.
శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ జోడిగా మెహర్ దీపక్ రూపొందించిన ‘తంతిరం’ సినిమా ఈ నెల 13న విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి