టాలీవుడ్‎లో ఈ వీక్ చిన్న సినిమాల సందడి.. ఓ హాలీవుడ్ సినిమా కూడా..  

Battula Prudvi

22 October 2024

హాలీవుడ్ మూవీ ‘వెనమ్‌’, ‘వెనమ్: లెట్ దేర్ బీ కార్నేజ్’ తర్వాత మూడో చిత్రంగా వస్తున్న ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’ అక్టోబర్ 25న విడుదల కానుంది.

అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘పొట్టేల్‌’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సాయిరోనక్, ప్రగ్యా నగ్రా జంటగా పెళ్లి బ్యాక్‌డ్రాప్‎లో రూపొందిన చిత్రం ‘లగ్గం’. ఇది ఈ నెల 25న థియేటర్లలో సందడి చేయనుంది.

టాలీవుడ్ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా ‘రోటి కపడా రొమాన్స్‌’ అక్టోబరు 25న రిలీజ్‎కి సిద్ధంగా ఉంది.

విడుదలకి ముందే అరవైకి పైగా పురస్కారాల్ని గెలుచుకున్న ‘నరుడి బ్రతుకు నటన’ అక్టోబరు 25న థియేటర్లలోకి రానుంది.

టాలీవుడ్ హారర్ థ్రిల్లర్బ్యాక్‌డ్రాప్‎లో రూపొందిన ‘C.202’ మూవీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్రీనివాస్ ఉలిశెట్టి, దియా రాజ, శాంతిప్రియా, నిహారిక కేశవ్, ప్రగ్యా గౌతమ్ ప్రధాన పాత్రల్లో ‘ఎంత పనిచేసావ్ చంటి’ అక్టోబర్ 25న విడుదల కానుంది.

అలాగే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మిస్టర్ పర్‌ఫెక్ట్, ఈశ్వర్ సినిమాలు మరోసారి థియేటర్లలో సందడి చేస్తున్నాయి.