సంక్రాంతికి రెండు నెలలు ఉండగానే రేస్ ఆసక్తికరంగా మారింది. గుంటూరు కారం, ఈగల్, సైంధవ్, నా సామిరంగా, హనుమాన్, ఫ్యామిలీ స్టార్ ఖర్చీఫ్ వేసాయి.
వీళ్లు సరిపోరన్నట్లు తమిళం నుంచి రజినీ లాల్ సలామ్, శివకార్తికేయన్ అయలాన్ కూడా సంక్రాంతి రేసులోనే ఉన్నాయి.
సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా.. గుంటూరు కారందే సింహభాగం. అందులో ఎలాంటి డౌట్స్ లేవు. జనవరి 12నే విడుదల కానుందీ సినిమా.
సైంధవ్, ఫ్యామిలీ స్టార్ జనవరి 13, 14 తేదీల్లో రానున్నాయి. సురేష్ బాబు, దిల్ రాజు ఉన్నందున ఈ సినిమాలకు థియేటర్స్ ఇష్యూస్ ఉండవు. కాబట్టి రావడం ఖాయం చేసుకోవచ్చు.
తాజాగా రవితేజ ఈగల్ కూడా జనవరి 13 అంటూ డేట్ ప్రకటించినా.. మాస్ రాజా బర్త్ డే స్పెషల్‌గా జనవరి 26న విడుదల చేస్తారని తెలుస్తుంది.
నా సామిరంగ షూటింగ్ ఇంకా సగం కూడా కాలేదు కాబట్టి నాగార్జున సినిమా సంక్రాంతి పండక్కి రావడం కష్టమే అనిపిస్తుంది.
మరోవైపు హనుమాన్‌తో ప్రశాంత్ వర్మ అండ్ టీం పక్కా పొంగల్‌కే వస్తామంటున్నారు. ఇది మొతటి తెలుగు సూపర్ హీరో చిత్రం.
మన సినిమాల మధ్య ఇంకా ఏ డబ్బింగ్ మూవీస్ రానట్లే. మొత్తానికి చూడాలిక.. సంక్రాంతి రేస్ ఎలా ఉండబోతుందో..?