దసరాకు 3 సినిమాలు వచ్చాయి.. అందులో భగవంత్ కేసరి బాక్సాఫీస్‌ను దున్నేస్తుంది. ఇప్పటికే 100 కోట్ల మైల్ స్టోన్ కూడా అందుకుంది.
వీక్ డేస్‌లోనూ వీక్ అవ్వకుండా దూసుకుపోతున్నాడు కేసరి.. ఆయనకు టైగర్ నాగేశ్వరరావు కూడా అంతో ఇంతో పోటీ ఇస్తున్నాడు.
ఇక దివాళికి కూడా 4 సినిమాలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ఆదికేశవ గురించే.
శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఆదికేశవ నవంబర్ 10న విడుదల కానుంది. నిజానికి అదే రోజు మరికొన్ని తెలుగు సినిమాలు రిలీజ్ డేట్ ప్రకటించినా ఏదీ రావట్లేదు.
ఇక ఆదికేశవకు పోటీగా వ్యూహం సినిమాను తీసుకొస్తున్నారు వర్మ. వైఎస్ జగన్ అరెస్ట్ నేపథ్యం చుట్టూ ఈ వ్యూహం సినిమా సాగుతుంది.
ఇక ఈ దివాళికి డబ్బింగ్ సినిమాలే ఎక్కువగా రానున్నాయి. అందులో సల్మాన్ ఖాన్ టైగర్ 3 నవంబర్ 12న విడుదల కానుంది. దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి.
అలాగే లారెన్స్ జిగర్తాండ డబుల్ ఎక్స్ నవంబర్ 10న విడుదల కానుంది. కార్తిక్ సుబ్బరాజ్ ఈ సినిమాకు దర్శకుడు.
కార్తి జపాన్ సినిమా దివాళికే వస్తున్నా.. డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు మేకర్స్. మొత్తానికి ఈ దివాళికి సినిమాల మోత మోగనుంది.