అనుష్క శెట్టి కథానాయకిగా, నవీన్ పోలిశెట్టి హీరోగా మహేశ్‌బాబు.పి దర్శకత్వంలో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ కృష్ణాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 7న ప్రేక్షకులను అలరించనుంది.
‘పఠాన్’ విజయం తర్వాత షారుక్ ఖాన్ నుంచి వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘జవాన్’. ఈ చిత్రం సెప్టెంబర్ 7న విడుదల కానుంది.
బ్రియాన్ నాపెన్‌బెర్గర్ దర్శకత్వం వహిస్తూ నిర్మాతగా వ్యహరించిన హాలీవుడ్ చిత్రం ‘స్కాట్స్ హానర్’. నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 5న స్ట్రీమ్ కానున్న చిత్రమిది.
ఇటీవల రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘జైలర్’ భారీ విజయాన్ని సంధించింది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా సెప్టెంబర్ 7న స్ట్రీమ్ అవ్వనుంది.
నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఓ ట్రాన్స్‌జెండర్ రోల్ లో నటించిన చిత్రం ‘హడ్డీ’. ఈ చిత్రం సెప్టెంబర్ 7న జీ5లో ప్రసారం కానుంది.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన హాలీవుడ్ చిత్రం ‘సిట్టింగ్ ఇన్ బార్స్ విత్ కేక్’ సెప్టెంబరు 8 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అలరించనుంది.
రాబర్ట్ లైబెర్మాన్ దర్శకతంలో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రం ‘లవ్ ఆన్ ది రోడ్’ సెప్టెంబరు 8న బుక్ మై షో వేదికగా ప్రసారం అవ్వనుంది.
అడ్రియన్ గ్రున్‌బర్గ్ డైరెక్ట్ చేసిన హాలీవుడ్ హారర్ సైన్స్ ఫిక్షన్ ‘ది బ్లాక్ డెమన్’. ఈ చిత్రం సెప్టెంబరు 8 నుంచి లయన్స్ గేట్ ప్లే లో అలరించనుంది.