TV9 Telugu
ఈ వారం చిన్న చిత్రాలదే సందడి అంతా..
04 March 2024
గోపీచంద్ హీరోగా తెరకెక్కించిన ఫాంటసీ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘భీమా’ ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విశ్వక్ సేన్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో రూపొందిన అడ్వెంచర్ డ్రామా ఫిల్మ్ ‘గామి’ మార్చ్ 8న విడుదలకి సిద్ధంగా ఉంది.
మలయాళీ బ్లాక్ బస్టర్ చిత్రం ‘ప్రేమలు' తెలుగు విడుదలకి సిద్ధమైంది. రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ నెల 8న తెలుగులో విడుదల చేయనున్నారు.
చదలవాడ శ్రీనివాసరావు తెరకెక్కించిన దేశ భక్తి చిత్రం ‘రికార్డ్ బ్రేక్’ ఈ నెల 8న థియేటర్లలో విడుదల కానుంది.
అజయ్, వంశీ ఏకశిరి హీరోలుగా ఆదిత్య శశాంక్ నేతి, రోమిక శర్మ హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘వి లవ్ బ్యాడ్ బాయ్స్’ ఈ నెల 8న విడుదల కానుంది.
రవితేజ నున్న హీరోగా నేహా జురెల్ కథానాయకిగా తెరకెక్కిన ‘రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి’ ఈ నెల 9న రిలీజ్ కానుంది.
రితికా సింగ్ ప్రధాన పాత్రలో రూపొందిన హారర్ మూవీ ‘వళరి’. ఇది మార్చ్ 6 నుంచి ఈటీవీ విన్ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
నిహారిక కొణిదెల నిర్మాతగా ఎలిఫెంట్ పిక్చర్స్ లో రూపొందిన 'సాగు' మార్చి 4న ఎంఎక్స్ ప్లేయర్‌లోనూ స్ట్రీమింగ్ కానుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి