అక్టోబర్ మొదటి వారం చిన్న సినిమాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలు ఇవే..
03 October 2023
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ తెరకెక్కించిన ‘రూల్స్ రంజన్’ చిత్రం అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సుధీర్‌బాబు హీరోగా హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మామ మశ్చీంద్ర’. ఈ చిత్రం ఈ నెల 6న థియేటర్ లో సందడి చేయనుంది.
నవీన్ చంద్ర, స్వాతి లీడ్ రోల్స్ లో శ్రీకాంత్ నాగోతి రూపొందించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’ ఈ నెల 6న ప్రేక్షకులను అలరించనుంది.
కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ముఖ్య పాత్రల్లో రూపొందిన ‘మ్యాడ్’ ఈ నెల 6న విడుదల కానుంది.
శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ గా వస్తున్న చిత్రం ‘800’. ఈ చిత్రం ఈ నెల 6న థియేటర్స్ లో మెప్పించనుంది.
సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన ఎస్‌యూ అరుణ్‌కుమార్ రూపొందించిన ‘చిన్నా’ చిత్రం ఈ నెల 6న ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘మిస్‌శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా అక్టోబరు 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మదనపల్లెలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’. ఇది అక్టోబర్ 6 నుంచి ఆహాలో ప్రసారం కానుంది.