ఈ వారం చిన్న సినిమాలాదే హవా.. 

13 November 2023

పాయల్‌ రాజ్‌పూత్‌, అజ్మల్‌ అమిర్‌ జంటగా అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం ‘మంగళవారం’ ఈ నెల 17న విడుదల కానుంది.

ఇటీవల వచ్చిన ‘సప్త సాగరాలు దాటి సైడ్‌-ఎ’ కి కొనసాగింపుగా వస్తున్న చిత్రం ‘సప్త సాగరాలు దాటి సైడ్‌-బి’ నవంబర్ 17న అలరించనుంది.

కథానాయకి హన్సిక ప్రధాన పాత్రలో శ్రీనివాస్ ఓంకార్ రూపొందించిన ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

విక్రాంత్‌ హీరోగా మెహరీన్‌, రుక్సర్‌ థిల్లాన్‌ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘స్పార్క్‌ లైఫ్‌’ నవంబరు 17న సందడి చేయనుంది.

విజయ్‌ ధరణ్‌ దాట్ల, సిమ్రాన్‌ గుప్తా, అనన్య నాగళ్ల ముఖ్య పాత్రల్లో అడవి నేపథ్యంలో సాగే ‘అన్వేషి’ ఈ నెల 17న రిలీజ్ కానుంది.

ప్రముఖ హాలీవుడ్ కామిక్స్ కంపెనీ డీసీ నుండి వచ్చిన చిత్రం ‘ది ఫ్లాష్‌’. నవంబరు 15 జియో సినిమా ద్వారా తెలుగు వెర్షన్ విడుదల కానుంది.

తారా సుతారియా, అభిషేక్ బెనర్జీ, రాజ్‌పాల్ నౌరంగ్ యాదవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హిందీ చిత్రం ‘అపూర్వ’ డిస్నీ+హాట్‌స్టార్‌ ద్వారా ఈ నెల 15న ప్రసారం కానుంది.

సిద్దార్థ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘చిత్త’ (తెలుగులో చిన్న) డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.