అక్టోబర్ రిలీజుల్లో భగవంత్ కేసరి, లియో సంగతి సరే... మిగిలిన సినిమాలేవి విడుదలవుతున్నాయి? ఏ వారం ఎన్ని పోటీలో ఉంటున్నాయి? అంటున్నారా? డీటైల్డ్ గా మాట్లాడుకుందాం.
కూర్చుంటే రూల్సు, నిలుచుంటే రూల్సు... అసలు లైఫ్ అంతా రూల్సు... అలాంటి వ్యక్తికి జీవితంలో ఎలాంటి సిట్చువేషన్ ఎదురైంది? తెలుసుకోవాలంటే రూల్స్ రంజన్ చూడాల్సిందే.
ఒక్క హిట్ అంటూ వెయిట్ చేస్తున్న కిరణ్ అబ్బవరం నటించిన సినిమా రూల్స్ రంజన్. అక్టోబర్ 6న రిలీజ్‌కి రెడీ అవుతోంది ఈ మూవీ.
సేమ్ డేట్‌కే ఫిక్సయ్యారు మామా మాశ్చీంద్ర. ఇందులో మూడు రకాల గెటప్పుల్ని ట్రై చేశారు సుధీర్‌బాబు. సినిమా చూసిన వారందరూ మంచి సినిమా చూశామనే ఫీల్‌తో బయటకు వస్తారని అంటున్నారు సుధీర్.
హ్యాపీడేస్‌లాంటి సినిమాలు వచ్చి చాన్నాళ్లయింది. మా సినిమా అంతకు మించి ఉంటుంది. ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుందని చెబుతున్నారు మ్యాడ్ మేకర్స్.
ముత్తయ్య మురళీధరన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన సినిమా 800. లెజండరీ క్రికెటర్ లైఫ్‌లో మ్యాచ్‌లకు సంబంధించిన ఇన్సిడెంట్స్ తో పాటు, ఎమోషన్స్ కూడా క్యారీ చేశారు ఈ మూవీలో.
మంత్ ఆఫ్ మధు, మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలు కూడా అక్టోబర్‌లోనే సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి.
స్టువర్ట్ పురం గజ దొంగ అనగానే అందరికీ టైగర్ నాగేశ్వరరావు పేరు గుర్తుకొస్తోంది ఈ మధ్య. మాస్ మహరాజ్ నటిస్తున్న ఈ సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ కూడా బలంగా ఉన్నాయి.