సెలెబ్రేషన్స్ లో మిస్ శెట్టి .. కొత్త చిత్రంతో సిద్దంగా రక్షిత్ శెట్టి..
18 September 2023
‘777 చార్లి’ ఫేమ్ రక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సప్త సాగరాలు దాటి’ ఈ నెల 22ను ప్రేక్షకుల ముందుకు రానుంది.
డి షోతో ఫేమస్ అయినా అక్సా ఖాన్ కథానాయకిగా, ఎం.ఎస్.చంద్ర, హరి ముఖ్యపాత్రల్లో రూపొందిన ‘నెల్లూరి నెరజాణ’ ఈ నెల 22ను థియేటర్స్ లో సందడి చేయనుంది.
చంద్రకాంత్ దత్త, రేఖ నిరోషా జోడిగా బర్ల నారాయణ తెరకెక్కించిన సినిమా ‘చీటర్’. ఈ మూవీ నెల 22ను థియేటర్ లో అలరించేందుకు సిద్ధంగా ఉంది.
ఆడవాళ్లపై అగత్యానికి పాల్పడిన వాళ్లకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో శ్రీమాన్ గుమ్మడవెల్లి తెరకెక్కించిన ‘నేనే సరోజ’ ఈ నెల 22ను విడుదల కానుంది.
కరీనా కపూర్ ఖాన్, జైదీప్, విజయ్ వర్మ ముఖ్య పాత్రల్లో సుజయ్ ఘోష్ తెరకెక్కించిన చిత్రం ‘జానే జాన్’ నెట్‌ఫ్లిక్స్ లో సెప్టెంబరు 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం ‘కింగ్ ఆఫ్ కోథా’ ఈ నెల 22 నుంచి డిస్నీ+హాట్ స్టార్ వేదికగా ప్రసారం కానుందని సమాచారం.
ఏతాన్ స్పాల్డింగ్ దర్శకత్వంలో మిడ్‌వే గేమ్‌లు, వార్నర్ బ్రదర్స్ సంయుక్తంగా నిర్మించిన ‘మోర్టల్ కోంబాట్ లెజెండ్స్: కేజ్ మ్యాచ్’ ఈ నెల 17న బుక్ మై షోలో స్ట్రీమింగ్ కానుంది.
యూనివర్సల్ పిక్చర్స్ లో లూయిస్ లెటెరియర్ డైరెక్ట్ చేసిన ఫాస్ట్ ఎక్స్ (హాలీవుడ్) సెప్టెంబరు 18న జియో సినిమా వేదికగా ప్రేక్షకులను అలరించనుంది.