03 September 2023
విలక్షణమైన కంటెంట్ ఉన్న మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్ అడివి శేష్. సినిమా ఒప్పకున్నప్పటి నుంచీ స్క్రీన్స్ మీదకు వచ్చేవరకు ప్రాణం పెట్టి పనిచేస్తారనే పేరుంది.
నవీన్ పొలిశెట్టికి కూడా స్పెషల్ ఇమేజ్ ఉంది. ఆయన సోలోగా సినిమాలు చేసినా, సాటి హీరోలతో కలిసి చేసినా నవీన్ పొలిశెట్టి సినిమాగానే ప్రొజెక్ట్ అవుతుంది ప్రాజెక్ట్.
దానికి తోడు ప్రమోషన్లలోనూ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయడం, మాటకారితనం వల్ల ప్రాజెక్ట్ కి అన్ ఆథరైజ్డ్ ఓనర్‌షిప్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంటున్నారు మిస్టర్ పొలిశెట్టి
సినిమా డైలాగుల్లో డీజే టిల్లు కైండ్ ఆఫ్ రైటింగ్ అని ఓ స్పెషల్ డిక్షన్‌ని క్రియేట్ చేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన హీరోలుగా నటించడమే కాదు, గుంటూరు టాకీస్‌కి స్టోరీ, డైలాగ్స్ అందించారు.
కృష్ణ అండ్ హిస్ లీలకి రైటర్, ఎడిటర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. మా వింత గాథ వినుమాకి రైటర్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ అండ్ ఎడిటర్. డీజే టిల్లు రైటింగ్ గురించి స్పెషల్‌గా మెన్షన్ చేయక్కర్లేదు.