ఈ వారం ఓటీటీలో అలరిస్తున్న సినిమాలు ఇవే.. 

TV9 Telugu

18 July 2024

'కుంగ్ ఫూ పాండా 4' ఆనిమేటెడ్ మూవీ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది జూలై 15న జియోసినిమాలో విడుదల అయింది.

'హరోమ్ హర' 1989లో కుప్పంలో జరిగిన కథాంశంతో తెరకెక్కింది. ఈ సినిమా జూలై 18న ఈటీవీ విన్‌లో విడుదల కానుంది.

'త్రిభువన్ మిశ్రా CA టాపర్' అనే హిందీ డ్రామా ఫిల్మ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా జులై 18 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

తెలుగు క్రైమ్ డ్రామా సినిమా 'బహిష్కరణ' జూలై 19 నుంచి Zee5లో సప్రసారం అవుతూంది. ఇందులో అంజలి ప్రధాన పాత్ర పోషించింది.

బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన 'ఆడుజీవితం' జూలై 19న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

నాగేంద్రన్ హనీమూన్స్ అనే మలయాళ కామెడీ సినిమా డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా జూలై 19న విడుదలకు సిద్ధమైంది.

ఇంగ్లీష్ డాక్యుమెంటరీ ఫిల్మ్ 'స్కైవాకర్స్: ఎ లవ్ స్టోరీ' నెట్‌ఫ్లిక్స్ వేదికగా జూలై 19 నుంచి ప్రసారం కానుంది.

'ఫైండ్ మీ ఫాలింగ్' అనే ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ చిత్రం జూలై 19న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.