ఈ వారం ఓటీటీ/థియేటర్లలో చిన్న సినిమాలదే హావా..

11 December 2023

శ్రీరామ్‌ హీరోగా సాయికిరణ్‌ దైదా తెరకెక్కిస్తున్న హారర్ చిత్రం పిండం ఈ నెల 15న థియేటర్లలో విడుదల కానుంది.

కొండా రాంబాబు దర్శకత్వంలో భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌ ప్రధాన పాత్రల్లో ‘కలశ’ చిత్రం ఏ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

బేబీ ఫేమ్ విరాజ్‌ అశ్విన్‌ హీరోగా అను ప్రసాద్‌ దర్శకత్వం వహించిన ‘జోరుగా హుషారుగా’ డిసెంబర్ 15న అలరించనుంది.

హరికృష్ణ, రామకృష్ణ హీరోలుగా యాని, రేఖ నిరోషా హీరోయిన్లుగా నటించిన ‘తికమక తాండ’ ఈ నెల 15న విడుదల కానుంది.

క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘చే’ చిత్రం ఈ 15న విడుదల అయ్యందుకు సిద్ధంగా ఉంది.

కూసే మునిసామి వీరప్పన్‌ అనే ఓ డాక్యుమెంటరీ చిత్రం డిసెంబరు 8 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.

అమెరికన్ డాక్యుమెంటరీ ఫిల్మ్ 'ది మిషన్' డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 10న తెలుగుతో పాటూ నాలుగు భాషల్లో విడుదలైంది.

కోలీవుడ్ స్టార్ కార్తీ దొంగగా కనిపించిన 'జపాన్' చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ నెల 11నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.