మిర్నా మీనన్ నటించిన చిత్రాలు ఇవే..

02 December 2023

2016లో పట్టతారి అనే ఓ తమిళ చిత్రంతో చలన చిత్ర అరంగేట్రం చేసింది.ఈ సినిమాలో అదితి మీనన్‌గా పరిచయం అయింది.

2018లో తమిళ కామెడీ చిత్రం కలవాణి మాప్పిళ్లైలో హీరోయిన్ గా కనిపించింది. దీనిలో కూడా అదితి మీనన్‌గా క్రెడిట్ పొందింది.

2020 సంవత్సరంలో బిగ్ బ్రదర్ అనే ఓ మలయాళ చిత్రం కేరళ ప్రేక్షకులకు పరిచయం అయింది వయ్యారి భామ మిర్న మీనన్.

2022లో తెలుగు రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ క్రేజీ ఫెలో సినిమాలో కథానాయకిగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది.

2023లో అల్లరి నరేష్ సరసన ఉగ్రం అనే తెలుగు యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో కథానాయకిగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఈ  ఏడాది బుర్ఖా అనే ఓ తమిళ చిత్రంలో నటించింది ఈ భామ.  ఇది డిజిటల్ లో విడుదలైంది. ఇది ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇటీవల వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం జైలర్ లో రజినీకాంత్ కోడలి పాత్రలో కనిపించి మెప్పించింది ఈ అందాల భామ.

2022లో అనంతం అనే ఓ తమిళ వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ లో ఆకట్టుకుంది. ఇది జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.