శ్రీముఖి నటించిన సినిమాలు ఇవే..
07 November 2023
బుల్లితెర రాములమ్మ శ్రీముఖి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. యాంకర్ మెప్పిస్తున్న ఈ బ్యూటీ నటించిన సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
2012లో జులాయిలో అల్లు అర్జున్ చెల్లెలిగా, లైఫ్ బ్యూటిఫుల్ సినిమాలో సోనియా అనే ఓ చిన్న పాత్రలో కనిపించింది.
2013లో ప్రేమ ఇష్క్ కాదల్ అనే ఓ చిత్రంలో కథానాయకిగా నాటింది. కార్తీక్ ఘట్టమని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
2015లో చంద్రిక, ధనలక్ష్మి తలుపు తడితే, ఆంధ్రా పోరి వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ వయ్యారి భామ.
2016లో నేను శైలజలో రామ్ సిస్టర్ గా, సావిత్రి, జెంటిల్‌మన్, మనలో ఒక్కడు వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు చేసింది.
2017లో శ్రీనివాస్ అవసరాల ప్రధానపాత్రలో వచ్చిన బాబు బాగా బిజీ అనే చిత్రంలో ఓ పాత్రలో కనిపించింది ఈ బ్యూటీ.
2021లో క్రేజీ అంకుల్స్ సినిమాలో ప్రధాన పాత్రలో, మాస్ట్రో సినిమాలో ఓ చిన్న పాత్రలో ఆకట్టుకుంది ఈ వయ్యారి.
చివరిగా 2023లో చిరు భోళా శంకర్ చిత్రం కీర్తి సురేష్ స్నేహితురాలి పాత్రలో నటించింది అందాల భామ శ్రీముఖి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి