Ott Platform

ఈ వారం ఓటీటీలో అలరించనున్న చిత్రాలు..

11 September 2023

Barbie Movie

గ్రెట గెర్విగ్ దర్శకత్వంలో వర్నర్ బ్రోస్ సామ్ పిక్చర్స్ లో తరకెక్కిన  చిత్రం 'బార్బీ'  సెప్టెంబరు 12న బుక్ మై షో వేదికగా  ఓటీటీలో అలరించనుంది.

Ramabanam

గోపీచంద్ డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన 'రామబాణం' చిత్రం ఎట్టకేలకు సెప్టెంబరు 14న నెట్‌ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్ కానుంది.

Bhola Shankar

చిరు హీరోగా నటించిన 'భోళా శంకర్'  చిత్రం ఆగస్టు 11న విడుదలై నిరాశను మిగిల్చింది. దింతో ఈ చిత్రాన్ని సెప్టెంబరు 15న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలో విడుదలకు సిద్ధం అయింది.

వెనెస్సా కాస్విల్ దర్శకత్వంలో బెన్ హార్డీ, హేలీ లు రిచర్డ్సన్ ముఖ్య పాత్రల్లో 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' (ఇంగ్లీష్ సినిమా) సెప్టెంబరు 15న నెట్‌ఫ్లిక్స్ లో అలరించనుంది.

అర్జున్ దాస్, దుషార విజయన్ జంటగా వసంతబాలన్ తెరకెక్కించిన తమిళ చిత్రం 'అనీతి'. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ లో సెప్టెంబరు 15న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

వలస వ్యవసాయ కార్మికుడు నుంచి అంతరిక్షంలోకి ప్రయాణం వరకు ఎదిగిన జోస్ హెర్నాండెజ్‌ బయోపిక్ గా వస్తున్న చిత్రం 'ఏ మిలియన్ మైల్స్ ఎవే' సెప్టెంబరు 15న అమెజాన్ ప్రైమ్ వేదికగా అలరించనుంది.

విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్ ఫుట్, సునీల్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'మాయపేటిక'. ఈ మూవీ సెప్టెంబరు 15న ఆహాలో విడుదలకు సిద్ధమైంది.

అభినవ్ మేడిశెట్టి, సాషా సింగ్ జోడిగా తెరకెక్కిన 'దిల్ సే' సినిమా సెప్టెంబరు 16న ఈటీవీ విన్ వేదికగా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది.