దసరా కానుకగా సందడి చేయనున్న సినిమాలు.. 

07 October 2024

Battula Prudvi 

‘జైలర్‌’ విజయం తర్వాత రజనీకాంత్‌ హీరోగా యాక్షన్‌ డ్రామా చిత్రం ‘వేట్టయాన్‌’ దసరా కానుకగా అక్టోబరు 10న విడుదల కానుంది.

గోపీచంద్‌, కావ్య తాపర్ జంటగా ‘విశ్వం’ అక్టోబరు 11న సందడి చేయనుంది. ఆరేళ్ల తర్వాత శ్రీను వైట్ల నుంచి వస్తున్న చిత్రమిది.

దసరా బరిలో ధ్రువ సర్జా ‘మార్టిన్‌’ కూడా ఉంది. వైభవి శాండిల్య కథానాయకిగా నటించింది ఈ మూవీ అక్టోబరు 11న రానుంది.

అలియా భట్, వేదాంగ్‌ రైనా ప్రధాన పాత్రల్లో ‘జిగ్రా’. అక్టోబరు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

సుధీర్‌ బాబు హీరోగా, ఆర్ణ కథానాయకిగా తెరకెక్కిన ‘మా నాన్న సూపర్‌ హీరో’ అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వరుస విజయాలతో జోష్ మీదున్న సుహాస్ హీరోగా ‘జనక అయితే గనక’ అక్టోబరు 12న రానుంది. సంకీర్తన కథానాయకిగా నటిస్తుంది.

'పైలం పిలగా' అనే తెలుగు కామెడీ డ్రామా చిత్రం ఈటీవీ విన్ వేదిక అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

తెలుగు సూపర్ క్రైమ్​ థ్రిల్లర్ సినిమా 'తత్వ' ఈటీవీ విన్‎లో అక్టోబరు 10 నేరుగా ఓటీటీలోనే ప్రసారం కానుంది.