ఈ వీక్ థియేటర్స్, ఓటీటీ వేదికగా సందడి చేయనున్న సినిమాలు ఇవే.. 

Battula Prudvi

14 October 2024

అంజన్‌ రామచంద్ర, శ్రావణిరెడ్డి జంటగా నటించిన చిత్రం ‘లవ్‌రెడ్డి’ అక్టోబరు 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రమాకాంత్‌, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్‌లుగా మత్స్యకారుల జీవితాలు ఆధారంగా తెరకెక్కిన ‘సముద్రుడు’ అక్టోబరు 18న విడుదల కానుంది.

రామ్ కార్తీక్, క‌శ్వి ప్రధాన పాత్రల్లో కామెడీ మిస్టరీ థ్రిల్లర్ ‘వీక్షణం’ అక్టోబరు 18న థియేటర్‌లో సందడి చేయనుంది.

సాయి రోనక్‌ హీరోగా రూపొందిన టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ మూవీ ‘రివైండ్‌’ అమృత చౌదరి హీరోయిన్. ఇది అక్టోబరు 18న విడుదల కానుంది.

అక్టోబర్ 4న థియేటర్లలో సందడి చేసిన ‘కలి’ అక్టోబర్ 17 నుంచి ఈటీవీ విన్ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.

‘ది లింకన్‌ లాయర్‌’ అనే ఓ ఇంగ్లీష్‌ మూవీ అక్టోబరు 17న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఓటీటీలో ప్రసారం కానుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా అక్టోబరు 18న ఓ ఇంగ్లీష్‌ సినిమా ‘రైవల్స్‌’ డిజిటల్ ప్లాట్‎ఫార్మ్‎పై స్ట్రీమింగ్ కానుంది.

‘1000 బేబీస్‌’ అనే ఓ మలయాళీ మూవీ అక్టోబరు 18 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ ఓటీటీ యాప్‎లో ప్రసారం కానుంది.