ఈ వీకెండ్ అదిరిపోవాల్సిందే.. థియేటర్, ఓటీటీల్లో అలరించే చిత్రాలు ఇవే..

TV9 Telugu

24 May 2024

'మ్యాడ్ మ్యాక్స్' కథలో ఐదవ చిత్రం 'మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్'. ఇది మే 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.

బెన్యామిన్ రచించిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆడుజీవితం ఆధారంగా వచ్చిన 'ది గోట్ లైఫ్' ఆదివారం (మే 26) డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలవుతోంది.

హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం జెన్నిఫర్ లోపెజ్ 'అట్లాస్' మే 24న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలవుతోంది.

మమ్ముట్టి, దర్శకుడు వైశాఖ్‌ల మూడో వెంచర్‌ యాక్షన్‌ కామెడీ 'టర్బో'. ఈ చిత్రం మే 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

టబు, కరీనా కపూర్ ఖాన్ మరియు కృతి సనన్ ఎయిర్‌హోస్టెస్‌లుగా నటిస్తున్న క్రూ మే 24న జిఓ సినిమా వేదికగా విడుదల కానుంది.

బిజు మీనన్, ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రల్లో రూపొందిన మలయాళ క్రైమ్ 'తలవన్' థ్రిల్లర్ మే 24న థియేటర్లలో విడుదల కానుంది.

మందాకిని మలయాళ కామెడీ డ్రామా చిత్రంగా తెరకెక్కింది. మే 24, 2024న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది ఈ మూవీ.

అదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌ CD (క్రిమినల్ ఆర్ డెవిల్) సినిమా మే 24న విడుదల కానుంది.