తారక్ వర్సెస్ కార్తీ.. నాని వర్సెస్ శ్రద్ద.. ఈ వారం థియేటర్, ఓటిటి..

23 September 2024

Battula Prudvi 

ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కించిన పాన్ ఇండియా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'దేవర' ఈ నెల 27న థియేటర్లలో సందడి చేయనుంది.

ఆ తర్వాతి రోజు అంటే సెప్టెంబర్ 28న ‘మెయ్యజగన్‌’ అంటూ వచ్చేస్తున్నారు తమిళ హీరో కార్తీ. తెలుగులో కూడా ‘సత్యం సుందరం’గా అదే రోజు రానుంది.

ఓటిటి విషయానికి వస్తే నాని హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ 'సరిపోదా శనివారం' నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్‌ 26న స్ట్రీమింగ్ కానుంది.

లేటెస్ట్ హారర్ బ్లాక్ బస్టర్ సీక్వెల్‌ మూవీ ‘డిమోంటి కాలనీ 2’ ఈ నెల 27 నుంచి ‘జీ 5’లో తెలుగు, తమిళ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

హిందీలో శ్రద్ధ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ సినిమా 'స్త్రీ 2' ఈ నెల 27న అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రసారం కానుంది.

శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం 'లవ్ సితార' సెప్టెంబర్ 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.

'హెవెన్‌ అండ్‌ హెల్‌' అనే ఓ ఇంగ్లీష్‌ సినిమా సెప్టెంబరు 26న నెట్‌ఫ్లిక్స్‌ వేదిక ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది.

'ఏ ట్రూ జెంటిల్‌మెన్‌' అనే మరో ఇంగ్లీష్‌ సినిమా కూడా సెప్టెంబరు 26 నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం కానుంది.