జూన్ మొదటి వారంలో సందడికి సిద్దమైన సినిమాలు..
TV9 Telugu
05 June 2024
శర్వానంద్, కృతి శెట్టి జంటగా తెరకెక్కిన కామెడీ రొమాంటిక్ డ్రామా చిత్రం ‘మనమే’ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో లేడీ ఒరింటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సత్యభామ’ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది.
పాయల్ రాజపుట్ పోలీస్ ఆఫీసర్ గా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘రక్షణ’ జూన్ 7న థియేటర్లలో సందడి చేయనుంది.
నవదీప్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘లవ్ మౌళి’. పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లు. ఇది ఈ నెల 7న రానుంది.
సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో విభిన్నమైన కథతో తెరకెక్కిన ‘వెపన్’ జూన్ 7న ప్రేక్షలను అలరించనుంది.
అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హిందీ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా ’మైదాన్’ జూన్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రెయిన్ అవుతుంది.
అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘బడేమియా ఛోటేమియా’ ఈ నెల 6 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ కానుంది.
హాలీవుడ్ రొమాంటిక్ బ్లాక్ కామెడీ మూవీ ‘హిట్ మ్యాన్’ జూన్ 7 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదిక ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి