KCR టైటిల్‌తో సినిమా..? హీరో ఎవరంటే..?

14 October 2023

జబర్దస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కొక్కరూ.. ప్రొడ్యూసర్లుగా.. డైరెక్టర్లుగా.. హీరోయిలుగా అప్‌గ్రేడ్‌ అవుతున్నారు.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమను తాము ప్రూఫ్‌ చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు జబర్దస్‌ కమెడియన్స్.

ఇక బ్లాక్ బస్టర్ బలగం ఫేమ్‌ వేణు తర్వాత.. రాకింగ్ రాకేష్ కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

తనే హీరోగా.. ప్రొడ్యూసర్‌గా... అంజి డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడు జబర్దస్‌ టీం లీడర్ రాకింగ్ రాకేష్.

ఆ సినిమాకు KCR అనే టైటిల్ ఫిక్స్‌ చేసిన రాకేష్‌.. తాజాగా మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా రివీల్‌ చేయించాడు.

ఈ చిత్రం టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ టైటిల్ పోస్టర్‌ పై KCR అంటే.. కేశవ చంద్ర రమావత్ అని ఉంది.

అయితే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను గుర్తుతెచ్చే విధంగా.. ఈ సినిమా పేరు ఉండడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.

తెలియకుండానే అందరూ రాకింగ్ రాకేష్ సినిమా గురించి ఆరా తీసేలా.. మాట్లాడేలా చేసుకుంటోంది ఈ చిత్రం టైటిల్.