నవంబర్ తొలివారంలో చిన్న సినిమాలదే హవా.. ఓటీటీ ఆ రెండు చిత్రాలు..
30 October 2023
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘కీడా కోలా’. ఈ చిత్రం నవంబర్ 3 న థియేటర్ లో సందడి చేయనుంది.
‘మా ఊరి పొలిమేర’ సీక్వెల్ గా వస్తున్న ‘మా ఊరి పొలిమేర 2’ నవంబర్ 3న ప్రేక్షకులను బయపెట్టనుంది. మొదటి భాగానికి మించి ఇది ఉండనుంది.
రోహిత్ నందా, ఆనంది జోడిగా రూపొందిన చిత్రం ‘విధి’. ఈ మూవీకి శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ దర్శకులు. నవంబర్ 3న విడుదల కానుంది.
విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్ మస్సే హీరోగా రూపొందిన సినిమా ‘12 ఫెయిల్’. ఇది నవంబర్ 3న విడుదల కానుంది.
శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘ఘోస్ట్’. కన్నడలో దసరా సమయంలోనే విడుదలైన ఈ చిత్రం నవంబర్ 3న తెలుగులో అలరించనుంది.
భాను భువ తారక దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్లాట్’. ఈ సినిమా నవంబర్ 3న విడుదల కానుంది. వికాస్ ముప్పల ఈ మూవీలో హీరో.
రామ్ పోతినేని హీరోగా నటించిన యాక్షన్ చిత్రం ‘స్కంద’ డిస్నీ+హాట్‌స్టార్ లో నవంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘జవాన్’ నవంబర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా హిందీ వెర్సన్ విడుదల కానుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి