సప్తగిరి మ్యూజిక్ డైరెక్టర్‌గా చేసిన సినిమా ఏంటో తెలుసా..

07 October 2023

కమెడియన్ సప్తగిరి అంటే తెలియని వారుండరు. సినిమాలలో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంటారు ఆయన.

ఆయన అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. సప్తగిరి సొంత ఊరు ఐరాల. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉంది.

భాస్కర్ దర్శకత్వంలో సిద్దార్థ్, జెనీలియా జంటగా వచ్చిన బొమ్మరిల్లు చిత్రానికి సహాయ దర్శకుడుగా పని చేశారు.

తర్వాత భాస్కర్ దగ్గరే అల్లు అర్జున్ పరుగు మూవీకి అసోసియేట్ డైరెక్టరుగా చేశారు. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో సప్తగిరి కనిపించారు.

తర్వాత కందిరీగ, గబ్బర్ సింగ్, జులాయి, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వంటి హిట్ చిత్రాల్లో కమెడియన్ గా నటించి మెప్పించారు.

అయితే 2013లో సుధీర్ బాబు, నందిత జోడీగా నటించిన హారర్ కామెడీ ప్రేమ కథ చిత్రంలో కమెడియన్ గా సప్తగిరి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

దీని తరవాత కమెడియన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి స్టార్ కమెడియన్స్ లిస్ట్ లో చేరారు. ఇదిలా ఉంటే ఒక సినిమాకి సంగీత దర్శకుడుగా పని చేశారు.

ఆ సినిమా ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా.. 2022లో కిరణ్ అబ్బవరం సమ్మతమే చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా స్వరాలందించారు.