యాంకర్ సుమ కథానాయకిగా చేసిన చిత్రం ఏంటో మీకు తెలుసా..

తెలుగు స్టార్ యాంకర్ సుమ కనకాల తెలియని వారుండరు.

బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది సుమ.

ఎప్పుడూ చలాకీగా ఉంటూ తన యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

బుల్లితెరపై మాత్రమే కాదు దాదాపు అన్ని పెద్ద సినిమా ఈవెంట్లకు ఈమె హోస్ట్ గా ఆకట్టుకుంటున్నారు.

అయితే ఈమె కెరియర్ తొలినాళ్లలో పలు సీరియల్స్, చిత్రాల్లో నటించింది.

కాగా ఈమె ఓ చిత్రంలో హీరోయిన్ గా కూడా చేసింది.

1996లో హీరోగా వక్కంతం వంశీ హీరోగా వచ్చిన  ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’  అనే చిత్రంలో కథానాయకిగా కనిపించింది.

ఈ చిత్రంలో సుమతో పాటు కావ్య మరో హీరోయిన్ గా కనిపించరు.

ఈ చిత్రాన్ని దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు తెరకెక్కించారు.