ముద్దు సీన్‌లతో ఆఫర్లు మిస్.. ఓవర్‌నైట్‌లో స్టార్ స్టేటస్.. ఎవరంటే

26 November 2024

Ravi Kiran

ఈ నటి ఒక్క సినిమాతో తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించింది. కెరీర్ తొలినాళ్లతో లిప్‌లాక్స్ వల్ల చాలా సినిమా ఆఫర్లు మిస్ చేసుకుందట. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. 

ఫస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఆ తర్వాత బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుని.. ఇప్పుడు తెలుగుతో పాటు హిందీలోనూ స్టార్ స్టేటస్ సంపాదించింది. 

ఆ నటి మరెవరో కాదు.. మృణాల్ ఠాకూర్. ‘ముజ్సే కుచ్ కెహ్తీ యే కమోషియా’ సీరియల్‌తో హిందీ బుల్లితెరకు పరిచయమైంది మృణాల్ ఠాకూర్. 

ఆ తర్వాత ‘అర్జున్’, ‘కుమ్‌కుమ్ భాగ్య’ అనే సీరియళ్లతో పాపులారిటీ సంపాదించింది. సినీ ఇండస్ట్రీలోకి మృణాల్ ఠాకూర్ అడుగుపెట్టేనాటికి.. ఆమె వయస్సు 20 ఏళ్ళు. 

2014లో వరుసగా మూడు మరాఠీ చిత్రాల్లో నటించింది మృణాల్. అయితే 2018లో విడుదలైన ‘లవ్ సోనియా’ చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. 

ఇది ఆమె మొదటి హిందీ సినిమా కాగా.. ఇందులో డీ-గ్లామరస్ రోల్ చేసిన మృణాల్.. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అనంతరం ‘సూపర్ ౩౦’, ‘బట్ల హౌస్’, ‘ఘోస్ట్ స్టోరీస్’, ‘జెర్సీ’ లాంటి సూపర్ హిట్స్ అందుకుంది.

ఇక మృణాల్ కెరీర్ మొదట్లో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడాన్ని ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారట. దాంతో పలు అవకాశాలను కోల్పోయిందట. 

ఆ తర్వాత తల్లిదండ్రులను ఒప్పించి ముద్దు సన్నివేశాల్లో నటించిందట ఈ అందాల భామ. 2022లో విడుదలైన తెలుగు సినిమా ‘సీతారామం’తో మృణాల్ ఠాకూర్ క్రేజ్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయికి చేరింది.