ఓటిటిలో వ్యూస్ కోసం మేకర్స్ కొత్త వ్యూహం..

02 November 2023

ఓటిటిని తక్కువగా అంచనా వేయడానికి లేదిప్పుడు. వందల కోట్ల వ్యాపారం అది.. నిర్మాతలకు అదనపు ఆదాయం కూడానూ.

మరి అన్ని కోట్లు ఇస్తున్నపుడు సేమ్ సినిమా ఎందుకు ఇవ్వాలి..? ఇదే ఆలోచిస్తున్నారు మూవీ మేకర్స్ ఇప్పుడు.

థియేటర్లో చూసినోళ్లు కూడా ఓటిటిలో ఫ్రెష్ ఫీల్ అవ్వాలని కొత్త మంత్రంతో వస్తున్నారు. వెండితెరపై చూడని బొమ్మను బుల్లితెరపై చూపిస్తున్నారు.

స్టార్ హీరోల సినిమాలకు 50 నుంచి 200 కోట్ల మధ్యలో ఓటిటి రైట్స్ పలుకుతున్నాయి. అందుకే థియేటర్లో చూసిన సినిమా కాకుండా.. ఓటిటి కోసమే కొత్త వర్షన్ ఇస్తున్నారు మేకర్స్.

తాజాగా జవాన్ సినిమాకు ఇదే చేయబోతున్నారు అట్లీ. థియేటర్‌లో లేని సీన్స్ ఓటిటిలో కలపాలని చూస్తున్నారు.. దానివల్ల వ్యూవర్ షిప్ పెరుగుతుంది.

అలాగే విజయ్ దళపతి లియో సినిమాకు ఇలాంటి ఎక్స్‌టెండెడ్ ఓటిటి వర్షన్ ప్లాన్ చేస్తున్నారు లోకేష్ కనకరాజ్.

విజయ్ హీరోగా వచ్చిన లియో థియేటర్స్‌లోనే 2.50 గంటల నిడివితో వచ్చింది. సినిమాలో లేని మరో అరగంట వరకు ఓటిటి వర్షన్‌లో జత చేయాలని చూస్తున్నారు మేకర్స్.

ఆ మధ్య అర్జున్ రెడ్డి సినిమాకు సందీప్ ఇలాగే ఎక్స్‌టెండెడ్ వర్షన్ విడుదల చేసారు. మరికొన్నిసినిమాలకు ఇదే ఫార్ములా అప్లై చేయాలని చూస్తున్నారు మేకర్స్.