13 September 2023

నాజూకు నడుమందాలతో కవ్విస్తున్న మౌనీ రాయ్.. 

Pic credit - Instagram

మౌనీ రాయ్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు గానీ.. 'నాగిని' సీరియల్ నటి అంటే ఠక్కున గుర్తొస్తుంది. 

అటు బుల్లితెర.. ఇటు వెండితెరపై నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ నాజూకు నడుమందాల బ్యూటీ మౌనీ రాయ్ 

నటనపై మక్కువ ఉన్న మౌనీ రాయ్.. తాను చదువుతున్న మాస్ కమ్యూనికేషన్ కోర్స్ మధ్యలో ఆపేసి.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 

2004లో బాలీవుడ్‌లో తెరకెక్కిన 'రన్' సినిమాలో ఐటెం సాంగ్ చేసిన మౌనీ రాయ్.. ఆ తర్వాత బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించి ఫేమస్ అయింది.

'నాగిన్' సీరియల్‌తో ఒక్క బాలీవుడ్‌లోనే కాదు.. మిగిలిన అన్ని ఇండస్ట్రీలలోనూ సుపరిచితురాలైంది ఈ భామ. ఈ సీరియల్ మూడు సీజన్లలో ఆమె కనిపించి.. నటనతో అందరినీ ఆకట్టుకుంది. 

ఇటీవల కన్నడ యాక్టర్ యష్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన  కేజీఎఫ్ చిత్రంలోనూ ఐటెం సాంగ్ చేసి.. అలరించింది మౌనీ రాయ్.. తన నాజూకు నడుమందాలతో ఫ్యాన్స్‌ను కవ్వించింది.