సొగసులో ఈ ముద్దుగుమ్మ దేవకన్యలు కూడా సరితూగరు..

TV9 Telugu

24 April 2024

28 సెప్టెంబర్ 1985న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూచ్ బెహార్ రాజ్‌బాంగ్షి కుటుంబంలో జన్మించింది మౌని రాయ్.

ఆమె తాత శేఖర్ చంద్ర రాయ్ ప్రసిద్ధ జాత్రా థియేటర్ ఆర్టిస్ట్. తల్లి ముక్తి థియేటర్ ఆర్టిస్ట్, తండ్రి అనిల్ రాయ్ కూచ్ బెహార్ జిల్లా పరిషత్ ఆఫీసు సూపరింటెండెంట్.

కూచ్ బెహార్‌లోని బాబర్‌హట్‌లో కేంద్రీయ విద్యాలయంలో 12వ తరగతి వరకు పాఠశాల విద్యను అభ్యసించింది ఈ బ్యూటీ.

తన తల్లిదండ్రుల ఇష్టం కారణంగా జామియా మిలియా ఇస్లామియాలో మాస్ కమ్యూనికేషన్‌ను చేపట్టింది ఈ వయ్యారి భామ.

అయితే ఆ కోర్సును మధ్యలోనే వదిలేసి హిందీ చిత్ర పరిశ్రమలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముంబై వెళ్లింది.

మౌనికి తన చిన్నతనం నుండి నటనపై ఆసక్తి ఉంది. నటీమణులు మధుబాల, మాధురీ దీక్షిత్ వహీదా రెహ్మాన్‌లను ప్రేరణగా తీసుకుంది.

2006లో ఏక్తా కపూర్ డ్రామా క్యుంకీ సాస్ భీ కభీ బహు థీతో తన కెరీర్‌ను ప్రారంభించింది. నాగినీ 1, 2, 3లతో మంచి పేరు తెచ్చుకుంది.

2022లో బ్రహ్మాస్త్ర: మొదటి భాగం - శివలో జునూన్ పాత్రలో ఆకట్టుకుంది. మూవీ ఫలితం ఎలా ఉన్న తన పాత్రకు ప్రశంసలు లభించాయి.