కొంగు చాటు అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న మౌని రాయ్
Phani CH
30 JULY 2024
నాగిని సీరియల్‌తో తెలుగు ప్రేక్షులకు దగ్గరైంది మౌనిరాయ్. స్మాల్ స్క్రీన్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెండితెరపైనా మెరుస్తోంది.
అంతకు ముందు ‘క్యూ కీ కభీ సాస్ భీ బహు థీ’ సీరియల్‌లో నటించినా రాని గుర్తింపు నాగిని సీరియల్‌తో వచ్చింది.
నాగిని సీరియల్ తర్వాత మౌని రాయ్ క్రేజ్ బాగా పెరగగా, ఈ అమ్మడికి పలు సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి. అంతేకాదు హిందీ టెలివిజన్ యాక్రెస్‌లలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరింది మౌని రాయ్.
మౌనీ రాయ్ ’నాగిని’ సీరియల్‌తో వచ్చిన పాపులారిటీతో 2011లో తొలిసారి ‘హీరో హిట్లర్ ఇర్ లవ్’ అనే పంజాబీ సినిమాతో తొలిసారి వెండితెరకు పరిచయమైంది.
2018లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘గోల్డ్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాకే ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూకు నామినేట్ అయింది.
గతేడాది రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో, హీరోయిన్లుగా అమితాబ్, నాగార్జున, షారుఖ్ ముఖ్యపాత్రల్లో నటించిన ‘బ్రహ్మాస్త్ర’లో జునూన్ పాత్రలో తన విలనిజం చూపించింది.
తుమ్ బిన్2, గోల్డ్ చిత్రాలతో పాటు కేజీఎఫ్‌లో ఐటెం సాంగ్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది మౌనిరాయ్.